కంజర్ గురుకులం ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిర్వహణపరమైన లోపాలు ఉన్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి రావడంతో మొపాల్ మండలం కంజర్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ విజయలలితకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అధికారుల తనిఖీ సందర్భంగా కంజర్ గురుకుల విద్యాలయం నిర్వహణలో లోపాల...