29 C
Hyderabad
Monday, August 3, 2026

దివంగత సర్పంచ్ పావని కుటుంబానికి అండగా సర్పంచ్‌ల ఫోరం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూ.1.40 లక్షల ఆర్థిక సహాయం అందజేత

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బెజ్జారపు పావని ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, మునిపల్లి గ్రామ సర్పంచ్ ముస్కు సాయిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు ఆదివారం ఆమె కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పావని కుటుంబానికి మొత్తం రూ.1.40 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జక్రాన్‌పల్లి మండల సర్పంచ్‌ల ఫోరం తరఫున రూ.80,000, డొంకేశ్వర్ మండల సర్పంచ్‌ల ఫోరం తరఫున రూ.50,000, అలాగే అంకాపూర్ గ్రామ సర్పంచ్ దేవేందర్ వ్యక్తిగతంగా రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని స్వర్గీయ బెజ్జారపు పావని కుమారులు భవిత్, భవిన్‌లకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ముస్కు సాయిరెడ్డి మాట్లాడుతూ, తమతో కలిసి పనిచేసిన సర్పంచ్ బెజ్జారపు పావని అకాల మరణం బాధాకరమని, ఆమె కుటుంబానికి తోటి సర్పంచ్‌లుగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఇతర మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కూడా ముందుకు వచ్చి పావని కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్‌ల ఫోరం కార్యవర్గ సభ్యులతో పాటు ఏర్గట్ల మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కౌడ భూమేష్, ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, బట్టపూర్ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, తడపాకల్ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్, నాగేంద్రనగర్ సర్పంచ్ సందే రంజిత్, గుమ్మిర్యాల సర్పంచ్ దేశబోయిన జమున సంజీవ్ యాదవ్, దోంచంద సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Sarpanchs' Forum stands by the family of the late Sarpanch Pavani.

More articles

Latest article