. . . టిఆర్ఎస్ పేరు పై వేయ్యి అభ్యంతరాలను మాకు ఇవ్వండి
. . . కేంద్ర ఎన్నికల కమిషన్ కు టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ లేఖ
హైదరబాద్, బతుకమ్మ :
ఎన్నికల సంఘం ఆమోదించిన అనేక పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయి. ఒక్క తెలంగాణలోనే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి పేర్లతో రెండు పార్టీలకు గుర్తింపునిచ్చారు. వాటికి లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేన పై ఎందుకు ? మా పార్టీ రిజిస్ట్రేషన్ ను వ్యతిరేకిస్తూ వచ్చిన వెయ్యి అభ్యంతరాలను మాకు పంపండి తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలని పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కు రిప్లయ్ ఇచ్చారు. తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి హోదాలో అనిల్ కుమార్ ఆదివారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ తో ఎన్నికల కమిషనర్ లకు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరును తమకు కేటాయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 28న లేఖ ద్వారా సమాచారం ఇచ్చిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రక్షణ సేన పార్టీ తమకు కేటాయించడంతో తెలంగాణ వ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించుకోవడం తో పాటు పార్టీ నిర్మాణ పరమైన ఇతర కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 23న తమకు లేఖ రాస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్ పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని పేర్కొన్నారని వివరించారు.. కానీ ఇంత వరకు ఆ అభ్యంతరాల్లో ఒక్కటి కూడా తమకు పంపలేదని తెలిపారు.. అభ్యంతరాలు ఎవరు తెలిపారు.. ఆయా అభ్యంతరాల్లో ఏమి పేర్కొన్నారు అనే వివరాలు కూడా ఇవ్వలేదన్నారు.. అసలు అభ్యంరాతలనే తమకు పంపకుంటే తాము సమాధానం ఎలా చెప్పగలమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు అని.. వెయ్యి అభ్యంతరాలు వచ్చాయనే సంఖ్యను చూపిస్తూ ఈసీ నిర్ణయం సరికాదన్నారు అసలు అభ్యంతరాల వెనుక లీగల్ మెరిట్ ఏంటీ అనేది పరిశీలించాలి, ఎవరైనా కావాలనే గ్రూపులుగా ఏర్పడి ప్లాన్ ప్రకారం ఇదంతా చేయించారా అనేది తమకు అబ్జెక్షన్ కాపీలు ఇస్తేనే తెలుస్తుంది. ఈసీ ఆమోదించిన పేరును నమ్ముకొని సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకున్నామని.. ఇప్పుడు ఆ పేరును మార్చుకోవాలని అంటే అది తమకు తీవ్ర నష్టం అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్టుగా తాము ఈసీ ఎదుట వ్యక్తిగత విచారణ హాజరవాడానికి ముందే తమ పార్టీపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలను ఇవ్వాలని కోరారు. అప్పుడు మాత్రమే తాము సరైన సమాధానం చెప్పుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రతిపాదిత “తెలంగాణ రక్షణ సేన” అనే పేరును మేము పూర్తి సదుద్దేశంతో స్వతంత్రంగా ఆలోచించి పెట్టిన పేరు అని వివరించారు”తెలంగాణ రక్షణ సేన” అనే పేరుతో దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీ కూడా నమోదు కాలేదని.. ఇది ఏ గుర్తింపు పొందిన లేదా నమోదైన రాజకీయ పార్టీ పేరును పోలి లేదని అన్నారు. రెండు పార్టీల పేర్ల మధ్య పోలికలను నిర్ధారించుకునేప్పుడు రాజకీయ పార్టీ యొక్క పూర్తి పేరును ఒకే సమగ్ర రూపంగా భావించాలని.. కానీ అందులోని విడి పదాలను ముక్కలు చేసి లేదా విడదీసి చూడకూడదన్నారు. ఎన్నికల కమిషన్ తమకు పంపిన అభ్యంతరాల్లోని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్) (2024) తెలంగాణ రాజ్య సమితి 2023) అనేవి వేర్వేరు పేర్లు.. విభిన్న ఉచ్చారణ, నిర్మాణం, గుర్తింపు, నాయకత్వం, సంస్థాగత శైలి తో పాటు ప్రజల్లో వేర్వేరు గుర్తింపు కలిగిన రాజకీయ పేర్లు అని వివరించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 29 కింద ప్రతిపాదిత “తెలంగాణ రక్షణ సేన” పార్టీ గుర్తింపు కోసం తాము చేసుకున్న దరఖాస్తును పరిశీలించి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
