25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పేదల ఆరోగ్యానికి పెద్దపీట

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిమ్స్ వైద్య చికిత్సకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ఎల్వోసీ అందజేత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్ లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని కార్యాలయంలో ఆదివారం ఎల్వోసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్ఓసి ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. నగరంలోని ఆటో నగర్ కు చెందిన మూడున్నరేళ్ల బాలిక ఉమ్మే కుర్సుం క్యాన్సర్ వ్యాధితో బాదపడుతున్నారన్నారు. దీంతో నిమ్స్ లో చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్వోసీ వారి కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమన్నారు.

. . . ఎయిమ్స్ లో అత్యాధునిక వైద్య సేవలు

హైదరాబాదులోని బీపీ నగర్ ఎయిమ్స్ లో అత్యాధునిక సేవలు అందుబాటు వచ్చాయన్నారు. పేదలు దీర్ఘకాలిక వైద్య సమస్యలు ఉన్నవారు, అత్యవసర శస్త్రసికిత్సలు అవసరమైన వారు ఎయిమ్స్ కి వెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వేయి కోట్లతో నిర్మించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. 132 మంది ప్రొఫెసర్లు, 133 మంది సీనియర్ డాక్టర్లు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. కావున నియోజకవర్గ ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియం చేసుకోవాలని కోరారు.

More articles

Latest article