26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ఖండించిన బీఆర్ఎస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

 

కోటగిరి, బతుకమ్మ :

 

కోటగిరి మండలంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ద్వారా తక్షణమే సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రెస్ మీట్ కార్యక్రమంలో యలమంచిలి శ్రీనివాసరావు, నార్ల రత్నకుమార్, మొరే కిషన్, తెల్ల రవి, సూడెం నవీన్, గంగా ప్రసాద్ గౌడ్, వై.ఎస్. దాస్, గంగప్ప, ఆనంద్ సెరుపులే తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

More articles

Latest article