కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ఖండించిన బీఆర్ఎస్ నాయకులు
కోటగిరి, బతుకమ్మ : కోటగిరి మండలంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ద్వారా తక్షణమే సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని...