25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పంట పొలాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారం తాండ గ్రామపంచాయతీ చెందిన మాక్లూర్ తాండాలోని వ్యవసాయ పంట పొలంలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి హంగామా చేశారు. దీంతో కౌలు రైతు దేవి సింగ్ భూమి యజమానితో పాటు ఇందల్వాయి ఎస్సై సుమలతకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని దేవి సింగ్ తెలిపారు. వ్యవసాయ బోరు కు సంబంధించిన పైపులైను ధ్వంసం చేయడంతో పాటు వరి మడిని పూర్తిగా ధ్వంసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల చెప్పులు నారు మడిలో లభ్యం కావడంతో చెప్పులను పోలీసులకు అప్పగించినట్లు ఆయన వివరించారు. నేరస్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

Unidentified persons destroyed the crop fields.

More articles

Latest article