29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

శాంతి భద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం సహించం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్మూర్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న  కేసుల పురోగతి పై సీపీ సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సమీక్షా సమావేశం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించగా ఈ సమావేశంలో ఆర్మూర్ డివిజన్  ఏ.సీ.పీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్.హెచ్. ఓలు, ఎస్సైలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని, చెక్ పోస్ట్ ల తనిఖీలు 24/7 తనిఖీలు చేయాలని, వాహనాల తనిఖీలు, చెక్ పోస్ట్ ల వద్ద సిబ్బంది అలసత్వం పనికిరాదని తెలిపారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీషీటర్లు, పాత నేరస్తులు, బెయిల్‌పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

 

Negligence in maintaining law and order will not be tolerated.

 

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. ఆర్మూర్ సబ్ డివిజన్ నిర్మల్, జగిత్యాల జిల్లా సరిహద్దు వరకు ఉన్నందున అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారిపై పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడి పోలీసు సిబ్బందితో సత్సంబంధాలు మెరుగుపరచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. అలాగే పేకాట , గుట్కా , ఇసుక మరియు ఇతర అక్రమ వ్యాపారాలపై నిరంతర దాడులు నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రిసెప్షన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత విస్తరించి, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఆర్మూర్ ఏ.సి.పి వెంకటేశ్వర రెడ్డి, సి.సి.ఆర్.బి ఏ.సి.పి గురునాయుడు, సి.సి.ఆర్బి ఇన్స్ పెక్టర్ ఆర్.అంజయ్య, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ పి. సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ రూరల్ సి.ఐ జాన్ రెడ్డి, భీంగల్ సి.ఐ సత్యనారాయణ గౌడ్, కమ్మర్ పల్లి ఎస్సై సతీష్, యర్గట్ల ఎస్సై రాజేశ్వర్, మోర్తాడ్ ఎస్సై పి.రాము, భీంగల్ ఎస్సై తిరుపతి, మెండోరా ఎస్సై సుహాసిని, ముప్కాల్ ఎస్సై కిరణ్ పాల్, బాల్కొండ ఎస్సై శైలేందర్, వేల్పూర్ ఎస్సై బి.సంజీవ్, నందిపేట ఎస్సై వినయ్, ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Negligence in maintaining law and order will not be tolerated.

More articles

Latest article