. . . ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్
మాక్లూర్, బతుకమ్మ :
ప్రతి ఒక్క ఓటరు తన ఓటరు వివరాలను ఈ నెల 24 లోపు తప్పక సమర్పించాలని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ అన్నారు. శుక్రవారం మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పర్యటించారు. గ్రామపంచాయతీలో బిఎల్ఓల ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్ఐఆర్ ప్రోగ్రాం ని పకడ్బందీగా నిర్వహించాలని మండలం, గ్రామస్థాయి అధికారులకు సూచించారు. ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించాలన్నారు. అప్లికేషన్ ఫామ్ ఎలా నింపుతున్నారు, ఎంత సమయం పడుతుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పర్యవేక్షించి, కేంద్రంలోని పిల్లల సంఖ్యను వారికి అందించే ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలతో నిత్యం వినియోగించే కూరగాయల పేర్లను, చిన్న చిన్న పద్యాలను, ఆటపాటలను ఆడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమన్న ఉపసర్పంచ్ సతీష్, తాసిల్దార్ శేఖర్, సెక్రెటరీ నవీన్, బిఎల్ వో సుభాషిని, సమంత, సునీత, కారోబార్ సాయిలు పాల్గొన్నారు.

