28.8 C
Hyderabad
Monday, August 3, 2026

సదాశివనగర్ మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా రుస్తుం నవీన్ రావు

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా భూంపల్లి గ్రామానికి చెందిన రుస్తుం నవీన్ రావును మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు మల్లికార్జునల ఆదేశాల మేరకు జరిగినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రుస్తుం నవీన్ రావు మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా నియమించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జునతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సదాశివనగర్ మండల ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, బీసీ వర్గాల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

More articles

Latest article