. . . మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్
ఏర్గట్ల, బతుకమ్మ :
రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం దివంగత వైఎస్ఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ కొనియాడారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బస్టాండ్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్ఆర్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ, 108 లాంటి కార్యక్రమాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తనదైన మార్క్ వేసుకుని ఇప్పటికి అవి కొనసాగుతు పేదలకు ఉచితం గా ఖరీదైనా వైద్యం అందుతుందంటే అది ఆయన ఆలోచనే అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి, గుమ్మిర్యాల సర్పంచ్ దేశ బోయిన జమున సంజీవ్, తోర్తి సర్పంచ్ కౌడ భూమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగా మోహన్, ఏర్గట్ల ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, నాగేంద్రనగర్ ఉప సర్పంచ్ షేక్ జాకీర్ హుస్సేన్, దొంచంద ఉప సర్పంచ్ ఆసిరెడ్డి హనుమంత్ రెడ్డి, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, బద్దం లింగారెడ్డి, మూస్కు మోహన్, పన్నాల నర్సరెడ్డి, మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మునీర్, మేకల సాయన్న, సుదన వేణి శ్రీనివాస్ గౌడ్, కూరాకుల బోర్రన్న, కంచరి రవి, కమ్మరి ముత్తన్న, కూరాకుల సాయన్న, ఆరేపు మాణిక్యం, జుంగల గణేష్, మల్లారెడ్డి, ఈరపట్నం చిన్న గంగారం ఓర్సు రాములు, కుమ్మరి సహదేవ్, తుపాకుల సుదర్శన్ గౌడ్, తునికి గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
