30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కోదండరాంకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం,వివిధ అధికారిక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రానికి మొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీ కోదండరాం ను శనివారం  ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం పాటు పెండింగ్ లో గల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించిన త్వరలో సమస్యలoన్నింటినీ సీఎం తో చర్చించి, పరిష్కరించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్, టీజీవో జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, జాఫర్ హుస్సేన్, అతిక్, సంజీవయ్య, జాకీ హుస్సేన్, నిరంజన్ గౌడ్, ఉమా కిరణ్ పాల్గొన్నారు.

More articles

Latest article