24.7 C
Hyderabad
Monday, August 3, 2026

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వైద్యాధికారి హిమబిందు

 

లింగంపేట, బతుకమ్మ :

 

వాతావరణ మార్పులు, వర్షాకాలం వచ్చే వ్యాధుల పట్ల ప్రజల ప్రమాదంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు హిమబిందు సూచించారు. వర్షాలు కురిసిన సమయంలో నీటి వల్ల వివిధ అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో ప్రధానంగా 3 రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. వర్షపు నీరు తాగు నీటిలో కలవడం వల్ల డయేరియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్-ఏ, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు వస్తాయన్నారు. ఇంటి చుట్టుపక్కల నీరు నిలవడం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వస్తాయని వెల్లడించారు. వ్యాధు లు రాకుండా నీటిని మరిగించి చల్లార్చి త్రాగాలనీ తెలిపారు. భోజనానికి ముందు, మూత్ర విసర్జన తర్వాత చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలన్నారు. మంచినీళ్లు మూత పెట్టిన పాత్రల్లోనే నిల్వ చేయాలి. వాంతులు, విరేచనాలు వస్తే వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం ఇచ్చి ఆసుపత్రికి తీసుకురావాలనీ వెల్లడించారు. ఇంటి పరిసరాల్లో కుండలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ కవర్లలో నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం మంగళవారం డ్రై డే గా పాటించి ఇంట్లోని కూలర్, డ్రమ్, బకెట్లను శుభ్రం చేయాలన్నారు. వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలన్నారు. తడిస్తే వెంటనే బట్టలు మార్చాలనీ సూచించారు. కాళ్లకు బూట్లు, చెప్పులు కచ్చితంగా ధరించాలనీ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అనుమానం వస్తే వెంటనే మీ గ్రామంలోని ఏఎన్ఎం, ఆశా కార్యకర్తను, లింగంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

More articles

Latest article