. . . రైల్వే గేట్ ను ఢీకొట్టిన లారీ
. . . విద్యుత్ తీగలపై పడిన గేట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని గుర్బబాది రోడ్డులో ( లలిత మహల్) థియేటర్ వద్ద రైల్వే గేట్ ను లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో గేట్ విద్యుత్ తీగలపై పడటంతో పెను ప్రమాదం తప్పింది. అసమయంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదు. రైల్వే గేటు మూసివేత సమయంలో నిర్ణిత సమయం ముగిసిన తర్వాత లారీ చొచ్చుకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది.


అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన, రైల్వే గేట్ ని విద్యుత్ తీగలపై నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారు రైల్వే అధికారులు. రైల్వే గేట్ ను లారీ డికోట్టంతో మరమ్మత్తులు చేస్తుండటంతో వన్ వే గా చేశారు. దానితో వాహనాలను దారి మళ్లించారు. ఈ ప్రమాధంతో ఆర్ ఓ ఆర్ బ్రిడ్జీల అవశ్యకతను గుర్తు చేసింది. నిజామాబాద్ నగరంలో రెండు ఆర్ఓఆర్ బ్రిడ్జిల నిర్మాణం నత్త నడక నడుస్తుండటంతో ట్రాపిక్ ఇబ్బందులను గుర్తు చేశాయి..

