29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని గోసంగీలు విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

ఎస్సీ57 ఎంబిఎస్సీ కులాల రాష్ట్ర అధ్యక్షులు నిరగొండ బుచ్చన్న

నిజామాబాద్, బతుకమ్మ :  ఈనెల 21న సోమవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో తలపెట్టిన ఎస్సి 57 ఉపకులాల నిరసన దీక్ష కార్యక్రమానికి ఎస్సి ఉపకులాలు గోసంగి, మొచి, బుడగజంగం, హోలియదాసరి, డక్కలి, చిందులు తదితర కులాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎస్సి ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నిరగొండ బుచ్చన్న పిలుపునిచ్చారు.  నిజామాబాద్ పట్టణంలో గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాజేష్ ఆధ్వర్యంలో “చలో హైదరాబాద్” నిరసన దీక్ష కరపత్రాలు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. త్వరగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ, ఎస్సి వర్గీకరణలో వెనుకబడ్డ ఉపకులాలను మాల, మాదిగ కులాలతో కలపకుండా ఎస్సి-ఏ గ్రూపులో చేర్చి 7%రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ అమలు చేయకుండా ఎస్సి కుల సర్వే చేపట్టి వర్గీకరణ చేయాలని ప్రధానమైన డిమాండ్లతో ఈ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.  దీనికి జిల్లాలో ఉన్న ఉపకులాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోసంగి సీనియర్ నాయకులు కర్రే లింగస్వామి, గంధం గంగాధర్, పస్తం రాజన్న, రాజు,దళిత నాయకులు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article