25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్ఐఆర్ ఫారాలను ఇంటింటికి పంపిణీ చేసిన సర్పంచ్

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని జీకే తండాకు చెందిన సర్పంచ్ శిరీష మహిపాల్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం ఎస్ఐఆర్ ఫారాలను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేసి బిఎల్ఓ లకు అందించాలని సూచించారు. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉందని అందుకు అనుగుణంగా ఒకరికి ఒకే ఓటు అనే నినాదంతో ప్రభుత్వం పని చేస్తుందని గుర్తు చేశారు. ఎవరికైనా రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే ఏదో ఒకచోట ఓటు హక్కును తిరస్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు ఆకాష్, రవి, బి ఎల్ వో సవిత, తదితరులు ఉన్నారు.

More articles

Latest article