32.2 C
Hyderabad

108 అంబులెన్స్ లోనే మహిళ ప్రసవం

Must read

📰 Generate e-Paper Clip

 

తాడ్వాయి, బతుకమ్మ :

 

రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి కే చెందిన గర్బిణికి పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో 108 అంబులేన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలోనే ప్రసవం జరిగింది. ఎల్లారెడ్డి పల్లికి చెందిన ప్రభాకర్ తన భార్యకు నెలలు నిండటంతో నొప్పులు వస్తున్నాయని 108 సర్వీస్ కు సమాచారం అందించాడు. తాడ్వాయి  108  అంబులెన్స్ హుటాహుటిన రాజంపేట మండల్ ఎల్లారెడ్డి పల్లి విలేజ్ చేరుకొని అక్కడి నుండి గర్భవతి అయిన సంగీతను కామారెడ్డి హాస్పిటల్ తరలిస్తూ ఉండగా కొండాపూర్ సమీపంలో ఆమెకు నొప్పులు ఎక్కువ అవడం వలన ఆంబులెన్స్ పక్కకు ఆపి ఈ ఎం టి (ఎమర్జేన్సీ మెనెజ్మెంట్ టెక్నిషియన్) రమేష్ నాయక్ డెలివరీ చేశారు. సంగీత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.  డాక్టర్ మనీష్ సహాయంతో ట్రీట్మెంట్ అందిస్తునే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డికి తరలించారు. ఈ ఎం టీ రమేష్, పైలెట్  మహేష్ లను అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article