27.5 C
Hyderabad
Friday, July 31, 2026

యువకుడు అనుమానస్పద మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

… హడావిడిగా అంత్యక్రియలు చేసేందుకు యత్నం

. . . మృతుని ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు

 ఎడపల్లి , బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా  ఎడపల్లి మండలం అంబం  గ్రామంలో  యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు.  ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మహిపాల్ (32) మంగళవారం గుండెపోటుతో చనిపోయాడు అని  హడావిడిగా అంత్యక్రియలు చేసేందుకు యత్నం జరిగింది. మెడపై ఘాటు కనిపించడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. ఉరివేసి చంపి గుండె నొప్పితో చనిపోయినట్లు చిత్రీకరించినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్త మహిపాల్ ను భార్య స్వరూప హత్య చేసినట్లు పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు మేరకు  ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి  పోలీసులు తెలిపారు.

More articles

Latest article