నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా కొనసాగుతున్న వి.భుజంగరావుకు, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా కొనసాగిన కిరణ్ కుమార్ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు, అదనపు బాధ్యతలు అప్పగించారు.
