26.6 C
Hyderabad
Monday, August 3, 2026

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీటీడీకి భారీ విరాళం

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆలయానికి వచ్చారు. ఆయన స్వామివారి సేవల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. భక్తి చిహ్నంగా అనంత్ అంబానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.50 కోట్ల విరాళం అందించినట్లు సమాచారం. అలాగే తిరుమల వచ్చే భక్తుల సౌకర్యార్థం 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు అనంత్ అంబానీకి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంత్ అంబానీ పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. పలువురు భక్తులు ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆసక్తిగా వీక్షించారు.

More articles

Latest article