29 C
Hyderabad
Monday, August 3, 2026

లైన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ కు అవార్డుల పంట..

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

హైదరాబాద్ లోని నిమ్మల కన్వెన్షన్ హాల్ లో 320 డి ఆధ్వర్యంలో ఆదివారం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్రంలో ఉన్న నూట అరవై ఎనిమిది క్లబ్బుల వారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా లైన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారు 9 మాసాలలో 213 సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని గుర్తించి అవార్డులను అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా గవర్నర్ లయన్ ఏ అమర్నాథ్ రావు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదుకుంటున్న లైన్స్ క్లబ్ రుద్రూర్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ లైన్ ఘట్టమనేని బాబురావు, గవర్నర్లు, మాజీ గవర్నర్లు, రుద్రూర్ క్లబ్ అధ్యక్షులు లయన్ కెవి మోహన్, కార్యదర్శి లయన్ గుండురు ప్రశాంత్ గౌడ్, జిల్లా చైర్మన్ లయన్ శ్యాంసుందర్ పహాడే, డైరెక్టర్ లయన్ పార్వతి ప్రశాంత్,   జిల్లాలో ఉన్న అన్ని క్లబ్ ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article