30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మోసపూరిత హామిలతో అన్ని వర్గాలను మోసం చేశారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

మోసపూరిత హామీలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకు పడ్డారు. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇన్సెంటివ్ ఓటర్ రివిజన్ ప్రోగ్రామ్ పై కార్యకర్తలు, నాయకులకు అవగాహన కల్పించేందుకు ఆదివారం విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన పట్టణంలోని భారత్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతితులుగా బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ జడ్పీ చైర్మన్లు దఫెదార్ రాజు, విఠల్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని, పదేళ్లు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ను దోచుకుంటోందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించారని అన్నారు. 2 లక్షల రుణమాఫీ సగం మందికే చేశారని, యూరియా కొరత ఉందని, రైతు బంధు, భరోసాలో మోసం చేశారని ఆరోపించారు. మహిళలకు 2500, తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాల హామీలు నెరవేరలేదని, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనేదే రాష్ట్రంలో డిమాండ్ అని స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చిందని, బీజేపీ ఎంపీ తెలంగాణను మరో పాకిస్తాన్ గా పోల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడలో బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని, పార్టీ వీడిన నాయకులను మళ్ళీ పార్టీ లోకి తీసుకోమని కేటీఆర్ స్పష్టం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా గతంలో పోచారం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆడియోను వినిపించారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ బీజేపీ ఎన్నికలు ఉన్నచోట ఎస్ఐఆర్ పెడుతోందని, ఓటర్ల పట్ల అప్రమత్తంగా ఉండి ఓట్లు తొలగించకుండా చూడాలని సూచించారు. 24 గంటల కరెంట్ లేదని, రైతులు మోసపోయారని, రేపు ఎన్నికలు వస్తే బాన్సువాడలో బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. రేవంతు రైతులు, ప్రజల పట్ల గౌరవం లేదని, బడ్జెట్లో కోత విధిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ, మాజీ స్పీకర్ కే ఆర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగించవద్దని, ప్రాంతీయ పార్టీలపై ఢిల్లీలో కుట్ర జరుగుతోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేశారని, తెలంగాణకు కేసీఆర్ అవసరమని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ లను కాపాడుకోవాలని అన్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో బాన్సువాడకు అధిక నిధులు వచ్చాయని, నిధుల కోసం ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ లో చేరినా నిధులు రావడం లేదని అన్నారు. రైతు బంధు రాలేదని, రేవంత్ రెడ్డి మోసగాడని, ఒక్క హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు. కేంద్రంలో బడా భాయ్, రాష్ట్రంలో చోటే భాయ్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక పవర్ అని, బాన్సువాడలో ఎగిరేది గులాబీ జండా అని అన్నారు. పోలీసులు మా నాయకులపై కేసులు పెడితే ఊరుకోమని, వచ్చేది మా రాజ్యమేనని, వడ్డీకి చక్రవడ్డీ ఇస్తామని హెచ్చరించారు. మైనారిటీలపై దాడి చేస్తే ఊరుకోమని, మళ్లీ మూడోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేద్దామని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ బాన్సువాడలో బీఆర్ఎస్ లేదనుకోవడం సరికాదని, ఇక్కడ కార్యకర్తలు చురుకుగా ఉన్నారని, బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలకు జిల్లా నాయకత్వం అండగా ఉంటుందని అన్నారు. వందకు వంద శాతం సభ్యత్వం చేయాలని, రైతుల సమస్యలు బీఆర్ఎస్ తోనే తీరుతాయని పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ హైదరాబాద్ లో వివిధ సర్వే సంస్థలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నాయని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 84 సీట్లు వస్తాయని, అందులో బాన్సువాడ కూడా ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల ఆశ వల్ల ఓడిపోయామని, యూరియా కొరత ఉందని చెప్పారు. పోచారం పోయినా ఇంతమంది కార్యకర్తలు ఉన్నారని, ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం ఖాయం అని అన్నారు. నిరుత్సాహం వద్దని, ఓటమి లెక్క కాదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేయాలని సూచించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లతో మోసం చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పెంచుతామని మోసం చేశారని, మూడు బడ్జెట్లయినా ఒక్క రూపాయి కేటాయించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ దళిత బంధు ద్వారా ఆదుకుందని, కాంగ్రెస్ హామీల వైఫల్యంపై ప్రచారం చేసి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా ఇంచార్జ్ విజి గౌడ్ మాట్లాడుతూ డిజిటల్ సభ్యత్వం తీసుకోవాలని, తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ తోట ఆగయ్య, జిల్లా ఇంచార్జ్ విజి గౌడ్, అంజిరెడ్డి, జుబేర్, నార్ల రత్నకుమార్, యలమంచిలి శ్రీనివాస్, ఎర్రవట్టి సాయిబాబా, బీర్కూర్ సర్పంచ్ ధర్మ తేజ, చందూర్ సర్పంచ్ మాధవ రెడ్డి, కౌన్సిలర్ లు ఫెరోజ్ ఖాన్, ఖలీల్, మాక్బూల్, మాజీ వార్డు సభ్యులు బాడీ శ్రీను, అక్బర్, నాయకులు రమేష్ యాదవ్, అబ్దుల్ ఖాదర్, అతిఫ్, ఇసాక్, సుధాకర్ యాదవ్, నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

They deceived all sections of society with fraudulent promises.

More articles

Latest article