27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తహసీల్దార్ బాలయ్య

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆదివారం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను తహసీల్దార్ బాలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందల్వాయి, ఇందల్వాయి తాండా, రంజిత్ నాయక్ తండా, గండి తండా గ్రామాలలో పర్యటించి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణినీ వేగవంతం చేయాలని బిఎల్ఓలకు సూచించారు. ఫారాల పంపిణీ చేసే ముందు ఎన్యుమరేషన్ ఫారం స్కాన్ చేసి ఓటర్ కి ఇవ్వాలన్నారు. ఫారాలు ఇచ్చేముందు ఎలా నింపాలో పూర్తి చేయాలో ఓటర్లకు వివరించి చెప్పాలని బిఎల్ఓ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి తాండ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు బాదావత్ సుదర్శన్ నాయక్, ఉప సర్పంచ్ బాలు, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article