26.6 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చిన్నారులను పోలియో చుక్కలు వేసిన కాసుల బాలరాజ్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

పోలియో రహిత భారత నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు.బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో రోగనిరోధక టీకాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడుతూ పోలియో రహిత భారత నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని పేర్కొన్నారు. ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోనూ ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సేవలు అందిస్తున్నారని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పోలియోను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు అందడం అత్యంత అవసరమని అన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కౌన్సిలర్లు ఖలేక్, హకీమ్, కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ పాషా, నాయకులు గోపాల్ రెడ్డి, ఏజాజ్, అలీమొదీన్ బాబా, ఆసుపత్రి సలహా మండలి సభ్యుడు శివదయాల్ వర్మ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Agro Industries Chairman inaugurates National Pulse Polio center.

More articles

Latest article