26.2 C
Hyderabad

ఏసిబికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇంటి నిర్మాణం అనుమతి కోసం రూ.25 వేల లంచం తీసుకుంటూ

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఐదు గుంటల భూమిలో ఒక గది రేకుల షెడ్ నిర్మాణంకు అనుమతి, ఇంటి నెంబర్ కేటాయించడానికి రూ.25 వేల లంచం తీసుకుంటు పంచాయతీ కార్యదర్శి ఏసిబికి చిక్కారు. ఖమ్మం జిల్లా ముదిగోండ మండలం భాణపురం గ్రామ పంచాయతీ సెక్రెటరీ తమ్మిశేట్టి సురేష్ లంచం తీసుకుంటుండగా ఖమ్మం అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. తనకు లంచం ఇస్తేనే ఇంటి నిర్మాణం చేసుకోవాలని లేకపోతే ఇంటి నెంబర్ ఇచ్చేది లేదని పంచాయతీ కార్యదర్శి అనడంతో రూ.25 వేల లంచం ఇచ్చుకోలేక ఏసిబిని ఆశ్రయించాడు. ఏసిబి అధికారులు సురేష్ ను రెడ్ హ్యండేడ్ గా పట్టుకుని అరెస్ట్ చేసి వరంగల్ ఏసిబి కోర్టులో హజరుపరిచారు.

More articles

Latest article