28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బోగస్ ఓట్ల తొలగింపుకు బిఎల్ఓ ల ఇంటింటి సర్వే ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో బోగస్ ఓటరు తొలగించడానికి ఇంటింటి సర్వేను గురువారం ప్రారంభించారు. ఈ మేరకు గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న బిఎల్ఓ లను అప్రమత్తం చేస్తూ ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య వివిధ గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సలహాలు సూచనలు అందించారు. ఈ మేరకు స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ ఇన్ఫర్మేషన్ ఫార్ములా పంపిణీలో భాగంగా మండలంలోని చంద్రన్ పల్లీ, గన్నారం, ఎత్తుతాండా, మెగ్య నాయక్ తండా లలో విఐపి లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందించడం జరిగిందని తాసిల్దార్ వెల్లడించారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బోగస్ ఓట్లను పూర్తిగా తొలగించాలని బిఎల్ఓ లకు ఆదేశించారు. అలాగే రెండు ప్రాంతాలలో ఓటు హక్కు ఉన్న వారిని కూడా ఏదో ఒకచోట ఓటు హక్కు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయన వెంట గన్నారం సర్పంచ్ సుజాత శ్రీనివాస్, చంద్రన్ పల్లీ సర్పంచ్ రఘు, గన్నవరం మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బైరయ్య, డిప్యూటీ తాసిల్దార్ శైలజ తదితరులు ఉన్నారు.

More articles

Latest article