27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్టీసీ బస్ ఢీకొని యువకుడు దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగర శివారులోని గాంధీ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం చెందారు.  ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. బాన్సువాడ కు చెందిన అనిల్ కుమార్ (35)అనే యువకుడు బైక్ పై నిజామాబాద్ వైపు వస్తుండగా బాన్సువాడ డిపోకు చెందిన బస్సు డికోట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ అక్కడికక్కడే తీవ్రగాయాలతో రక్తస్రావం జరిగి మరణించాడు.  గాంధీనగర్ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్ ను బైక్ డికోట్టినట్టు స్థానికులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Youth killed after being hit by RTC bus

More articles

Latest article