ఆర్టీసీ బస్ ఢీకొని యువకుడు దుర్మరణం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులోని గాంధీ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. బాన్సువాడ కు చెందిన అనిల్ కుమార్ (35)అనే యువకుడు బైక్ పై నిజామాబాద్ వైపు వస్తుండగా బాన్సువాడ డిపోకు చెందిన బస్సు డికోట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ అక్కడికక్కడే తీవ్రగాయాలతో రక్తస్రావం జరిగి మరణించాడు. గాంధీనగర్ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్ ను బైక్ డికోట్టినట్టు స్థానికులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు...