30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

జుక్కల్ రాజ్యాధికార పార్టీ ఇన్‌చార్జిగా ఈశ్వర్ జాదవ్

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఈశ్వర్ జాదవ్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు తాహెర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల విస్తరణకు ఆయన సేవలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ జాదవ్ మాట్లాడుతూ, పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జుక్కల్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్బిడి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కళ్లెం రాజు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article