నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న వారికి వాటిని వెతికి తిరిగి అప్పగించినట్లు ఎస్ఐ సునిల్ తెలిపారు. గతంలో పోగొట్టుకున్న 3 ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి శనివారం వాటిని యజమానులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ సునిల్ మాట్లాడుతూ… సెల్ ఫోన్ లు పోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అన్నారు. సెల్ ఫోన్ లను పోగోట్టుకుంటే దానికి సంబంధించిన వివరాలను పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం ద్వారా ఆన్ లైన్ సేవలను నిలిపివేయవచ్చని పేర్కోన్నారు. విలువైన సెల్ ఫోన్ లను అప్పగించినందుకు వాటి యజమానులు పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

