బిచ్కుంద, బతుకమ్మ :
బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఫ్రీ ప్రైమరీ స్కూల్ ను మంజూరు చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు భూషణ్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్లో సరస్వతి మాత ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం విద్యార్థిని విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఆట వస్తువులు ప్రత్యేకత వసతులతో తరగతి గదులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సర్పంచ్ పట్లోల సంతోష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు భూషణ్, జిహెచ్ఎం ఆనంద్ కుమార్, ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, రోజా, శ్రీధర్, పరిపూర్ణ, బసవరాజ్లు, గ్రామ వార్డు మెంబర్లు కొట్టం సాయిలు, నాందేవ్, సంతోష్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

