29 C
Hyderabad
Monday, August 3, 2026

వర్షాకాలంలో ప్రజల ఆస్తి ప్రాణా రక్షణకు అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

 

గాంధారి, బతుకమ్మ :

 

త్వరలో వర్షాకాలంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే వరదలు, భారీ వర్షాల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పాటుపడాలని అన్నారు. కేసుల పురోగతిని సమీక్షించి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. ఆస్తి నేరాలు, దొంగతనాల నివారణకు ప్రత్యేక ప్రణాళికతో పని చేయాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పేకాట, ఆన్ లైన్ బెట్టింగ్ లపై ఉక్కుపాదం మోపాలని, సైబర్ క్రైంలపై ప్రజలకు అవగాహన పెంచాలని కోరారు.

 

People must remain vigilant to protect their lives and property during the monsoon season.

More articles

Latest article