వర్షాకాలంలో ప్రజల ఆస్తి ప్రాణా రక్షణకు అప్రమత్తంగా ఉండాలి
. . . జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గాంధారి, బతుకమ్మ : త్వరలో వర్షాకాలంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే వరదలు, భారీ వర్షాల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పాటుపడాలని అన్నారు. కేసుల పురోగతిని సమీక్షించి నేరస్తులకు శిక్ష పడేలా...