. ఏడో బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సైతం..
. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్లుగా బదిలీ
నిజామాబాద్, బతుకమ్మ: పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనేవార్, ఏడో బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై పంపుతూ రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కల్మేశ్వర్, రోహిణి ప్రియదర్శిని భార్యాభర్తలు. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అనుమతించాలని వారివురు దరఖాస్తు చేశారు. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఇద్దరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ సీపీగా, బెటాలియన్ కమాండెంట్ గా ఇంకా ఎవరినీ నియమించలేదు.
