ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా షేక్ రియాజ్ ఏకగ్రీవంగా నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం సర్పంచ్ గంగామణి గంగారం ఆధ్వర్యంలో మాజీ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాజాపురం మహేందర్ చేతుల మీదుగా నూతన గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కు బాధ్యతలను అప్పగించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులను గ్రామ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుందని నూతన గ్రామ కమిటీ చైర్మన్ షేక్ రియాజ్ స్పష్టం చేశారు. పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూతన చైర్మన్ గా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు గ్రామస్తులకు రుణపడి ఉంటానని ఆయనన్నారు. వైస్ చైర్మన్ గా ముడిగం పెద్ద సాయి రెడ్డి, తేలు రాములు, లోకర్ సాయిలు, బాగిర్తి నారాయణ, కుమ్మరి గణేష్, శ్రీపతి పెద్ద సాయిలు, ఖాజాపురం భూమేష్, తుమ్మల సత్యం, బండి సుదర్శన్, ఎడపల్లి నడిపి సాయిలు తదితరులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, కల్వరాల రఘుపతి రెడ్డి, దాసరి అంజయ్య, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
