30.9 C
Hyderabad
Monday, August 3, 2026

నిమ్స్ వైద్య చికిత్సకు ఎల్వోసీ అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నియోజకవర్గంలోని పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని, అవసరమైన వారికి నిమ్స్ లో ఎల్వోసీ అందజేస్తు న్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఎల్వోసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్ఓసి ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. నగరంలోని మార్వాడి గల్లీకు చెందిన ఎన్. రేఖ క్యాన్సర్ వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రూ. 5లక్షల ఎల్వోసీ వారి కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article