26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ పార్టీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు నిజామాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడం ఈ హెల్ప్ డెస్క్ ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ హెల్ప్ డెస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం కరిపే రాజు, దర్శనం దేవేందర్, ఇరుముల శంకర్, తొర్నే సత్యనారాయణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రూప్ సింగ్, అవంతి రావు, లక్ష్మీ నారాయణ, నిఖిల్, అంబటి శ్రీనివాస్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ హెల్ప్ డెస్క్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

More articles

Latest article