ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ పార్టీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు నిజామాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడం ఈ హెల్ప్ డెస్క్ ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ హెల్ప్ డెస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ...