29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా శంకర్ బాధ్యతల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి గా శంకర్ బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ జిల్లా డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్న శంకర్ కు ఇటీవల నిజామాబాద్ కు బదిలీ అయింది. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ సీఈవో శంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా తరఫున ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సీఈఓ సాయి గౌడ్, ఎంపీడీవో అసోసియేషన్ తరపున శ్రీనివాస్ రావు జిల్లా పరిషత్ పర్యవేక్షకులు, సిబ్బంది పుష్ప గుజ్జాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గడ్డం భాస్కర్, సెక్రటరీ ప్రదీప్ కుమార్, ట్రెజరర్ విట్టల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిద్దు పటేల్, కార్యనిర్వాహక సభ్యులు అందరు పాల్గొన్నారు.

 

Shankar assumes charge as Zilla Parishad Deputy CEO.

More articles

Latest article