జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా శంకర్ బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి గా శంకర్ బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ జిల్లా డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్న శంకర్ కు ఇటీవల నిజామాబాద్ కు బదిలీ అయింది. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ సీఈవో శంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా తరఫున ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సీఈఓ సాయి గౌడ్, ఎంపీడీవో అసోసియేషన్ తరపున శ్రీనివాస్ రావు జిల్లా పరిషత్ పర్యవేక్షకులు,...