29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రాణాలు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . లక్షలు పోగోట్టుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

 కామారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎం.ఆర్.కాలనీలో యువకుడి సూసైడ్ కలకలం రేపింది. ఇటివల జరిగిన ఐపిఎల్ క్రికెట్ పోటీల సందర్భంగా  ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ.12 లక్షలు కోల్పోయిన క్రాంతి అనే యువకుడు.  కామారెడ్డి పట్టణంలో ఇందిరా నగర్ చర్చి వెనుక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం విషయం వెలుగు చూసింది.గత కొన్ని నెలలుగా బెట్టింగ్ కు బానిసైన క్రాంతి, అప్పులు తెచ్చి బెట్టింగ్ లో పెట్టినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పులు తీర్చే దారి లేక  క్రాంతి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. బుధవారం ఇంటి నుంచి వెళ్లిన క్రాంతి తిరిగి రాలేదని, స్థానికంగా బైక్ పక్కన  పెట్టి చెట్టుకు తాడుతో ఉరి వేసుకున్నాడు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Online betting claims lives

More articles

Latest article