29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సైన్స్ టీచర్ కు స్వాగతం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: నిజామాబాద్ జిల్లాస్థాయిలో మూడవ ర్యాంక్ సాధించి మోర్తాడ్ మండలం పాలెం పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సైన్స్ టీచర్ గా చేరిన మమత ను గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లెపాటి వేణుగోపాలరావు ఆమెను శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని ఎందరో తమ లాంటి విద్యావేత్తలను తయారు చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహేష్ కుమార్, చంద్రశేఖర్, నరసింహస్వామి, రాజేందర్, త్రివేణి, జయశ్రీ, రాజేశ్వరి, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Welcome to Science Teacher

More articles

Latest article