27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీపీఎం ఏరియా కార్యదర్శిగా నన్నేసాబ్

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సీపీఎం ఏరియా 2వ మహాసభలో పార్టీ సభ్యులు కామ్రేడ్ నన్నేసాబ్ ను ఏరియా కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. కమిటీ సభ్యులుగా లక్ష్మణ్ (రుద్రూర్), సాయిబాబు (వర్ని), గంగాధర్ (మోస్రా), రాములు (పోతంగల్), లక్ష్మణ్ (కోటగిరి), సాయిబాబా (చందూర్) ఎన్నికయ్యారు. ఏరియాలో పార్టీ బలోపేతం కొరకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. పొడు సాగుదారులకు షరతులు లేకుండా పట్టాలు ఇవ్వాలని, కౌలు రైతులకు రైతు భరోసా, రైతు భీమా, పంట నష్ట పరిహారం అందేలా చూడాలన్నారు. నూతన మండలాల్లో కాలేజీలు నిర్మించాలని, ఏరియాలో మహిళా పోలీస్ స్టేషన్ తో పాటు, మహిళా డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని తీర్మానాలు చేసి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More articles

Latest article