సీపీఎం ఏరియా కార్యదర్శిగా నన్నేసాబ్

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సీపీఎం ఏరియా 2వ మహాసభలో పార్టీ సభ్యులు కామ్రేడ్ నన్నేసాబ్ ను ఏరియా కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. కమిటీ సభ్యులుగా లక్ష్మణ్ (రుద్రూర్), సాయిబాబు (వర్ని), గంగాధర్ (మోస్రా), రాములు (పోతంగల్), లక్ష్మణ్ (కోటగిరి), సాయిబాబా (చందూర్) ఎన్నికయ్యారు. ఏరియాలో పార్టీ బలోపేతం కొరకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. పొడు సాగుదారులకు షరతులు లేకుండా పట్టాలు ఇవ్వాలని, కౌలు...