29 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నేటి నుంచి ఓపీ సేవలు నిలిచిపోయాయి. నిబంధనలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులు ప్రకటించారు. జీవో 38 అమలు చేయాలని , వైద్యుల బదిలీలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పౌజ్​ భార్యాభర్తలు కేటగిరీ, అనారోగ్య సమస్యలు ఉండి బదిలీల్లో ప్రాధాన్యత కోరుతున్న వారికి న్యాయం జరగడం లేదని టీజీజీడీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌తో పాటు అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అత్యవసర సర్జరీలు మినహా ముందుగా నిర్ణయించిన ఆపరేషన్లను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

More articles

Latest article