29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పిట్లం లొ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వైద్యుడి నిర్లక్ష్యం వలన వ్యక్తి మృతి చెందాడని నిరసన

 పిట్లం, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం…నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన సాయిలు అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం పిట్లంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సాయిలు వైద్యుల తప్పుడు వైద్యం వల్ల మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యుడైన వైద్యుడిపై ఫిర్యాదు చేస్తామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు..గతంలో పిట్లం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పలువురు చికిత్స సమయంలో మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Protest in front of private hospital in Pitlam

More articles

Latest article