. . . గుండారంలో 39 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
. . . ముఖ్య అతిథిగా పాలొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రూరల్ మండలం గుండారంలో ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా రాయిస-ఫాతిమా ఇంటిని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో తొలివిడతలో మొత్తం 39 ఇండ్లు మంజూరు కాగా 26 గ్రౌండింగ్ పూర్తి చేసుకున్నాయి. ఇప్పటి వరకు 12 నూతన గృహప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, సర్పంచ్ ఫోరం రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు వాసు, బాగారెడ్డి, ఉమ్మాజి నరేష్, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, ధర్మాగౌడ్, రాంచందర్ గౌడ్, శ్యాం సన్, మోహన్, ఫిషరీస్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

