ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మంగళవారం జాతీయ జెండాలను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బాలయ్య, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద అగ్రికల్చర్ అధికారి శ్రీకాంత్, ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్సై సందీప్, ఇందల్వాయి అటవీ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ ఆర్ ఓ రవి మోహన్ బట్, ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సునీత, నల్లవెల్లి సహకార సంఘంలో చైర్మన్ నోముల శ్రీనివాస్ రెడ్డి, ఇందల్వాయి సహకార సంఘంలో చైర్మన్ లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాలలో సీసీలు ఉదయ్, పద్మ, వైస్ చైర్మన్ రమేష్, డైరెక్టర్లు, వైస్ చైర్మన్ మారుతి నాయక్, సీఈవో శ్రీకాంత్, బాలకిషన్, రవి, డైరెక్టర్లు పలు ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

