27.2 C
Hyderabad

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలలో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, తహశీల్దార్ తారాబాయి, ఎస్సై సాయన్న, స్థానిక మండల ప్రజాప్రతినిధులు పత్తి రాము, మేక వెంకన్న, వడ్ల నరేష్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article