చందూర్, బతుకమ్మ :
చందూర్ మండలంలోని కారేగాం తాండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక కుటుంబాలు శాశ్వత గృహాలను పొందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గంగాధర్, ఇంచార్జ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సీతారాం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వసంత్ రావ్ , కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
